Header Banner

వైజాగ్ మెట్రో కు గ్రీన్ సిగ్నల్! ఆ ప్రాంతాల మీదగా కారిడార్!

  Wed May 07, 2025 13:02        Others

ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నగరంలో మూడు కారిడార్లుగా మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ప్రాజెక్టు ప్లానింగ్, టెండర్ ప్రక్రియ, పనుల పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన కన్సెల్టెన్సీ ఎంపికకు సంబంధించి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సంస్థ టెండ్లర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్ 3, 2024న ఏపీ ప్రభుత్వం ఫేజ్ 1కు ఆమోదం తెలిపింది. ఇది మొత్తం 42 స్టేషన్లలో 46.23 కి.మీ ఉంటుంది. మొత్తం మూడు కారిడార్లను కవర్ చేస్తుంది.

 

కారిడార్ 1: స్టీల్ ప్లాంట్ జంక్షన్- కొమ్మాడికి

ఈ ప్రాజెక్టు పూర్తి పొడవు 34.40 కి.మీ విస్తరించి ఉంటుంది. ఎలివేటెడ్ రకం స్టేషన్లు ఉంటాయి. మొత్తం 22 స్టేషన్లను ప్రతిపాదించారు. స్టీల్ ప్లాంట్ జంక్షన్, ఆటో నగర్, BHPV, షీలా నగర్, విశాఖ విమానాశ్రయం, NAD జంక్షన్, GSI, మురళీ నగర్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అక్కయ్యపాలెం, గురుద్వారా జంక్షన్, మద్దిలపాలెం, హనుమంతవాక జంక్షన్, కొమ్మాడి జంక్షన్ లో స్టేషన్లను నిర్మించనున్నారు. వీటిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

 

కారిడార్ 2: గురుద్వారా జంక్షన్- పాత పోస్టాఫీసు

ఈ కారిడార్ మొత్తం 5.08 కిలో మీటర్లు ఉంటుంది. ఎలివేటెడ్ రకం స్టేషన్లు ఉంటాయి. ఈ పరిధిలో మొత్తం 7 స్టేషన్లను నిర్మించనున్నారు. గురుద్వారా జంక్షన్, BVK కళాశాల, RTC కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, సరస్వతి సర్కిల్, పూర్ణ మార్కెట్, పాత పోస్టాఫీసు ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! చెన్నై- విజయవాడ వందే భారత్ ఆ జిల్లా వరకు పొడిగింపు!


కారిడార్ 3: తాటిచెట్లపాలెం- చిన్న వాల్తేరు

ఈ కారిడార్ 6.75 కిలో మీటర్లు ఉంటుంది. ఎలివేటెడ్ రకం స్టేషన్లు ఉంటాయి. మొత్తం 9 స్టేషన్లను నిర్మించనున్నారు. తాటిచెట్లపాలెం, కొత్త రైల్వే కాలనీ, రైల్వే స్టేషన్, అల్లిపురం జంక్షన్, RTC కాంప్లెక్స్, సిరిపురం జంక్షన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, చిన్న వాల్తేరులో మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.

 

అదనపు ప్రతిపాదిత కారిడార్లు వివరాలు

వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ మొత్తం 79.91 కి.మీ పరిధిలో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు కారిడార్లు ఇప్పటికే ఫైనల్ కాగా నాలుగు, ఐదవ కారిడార్ల నిర్మాణం పైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 

కారిడార్ 4: కొమ్మడి నుంచి భోగాపురం వరకు నిర్మించనున్నారు. మొత్తం 30.48 కి.మీ ఉంటుంది.

 

కారిడార్ 5: లా కాలేజ్ జంక్షన్ నుంచి మరికివలస

వరకు చేపడుతారు. 8.21 కి.మీ నిర్మాణం జరగనుంది. ఈ కారిడార్లు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇతర శివారు ప్రాంతాలను అనుసంధానం చేయనున్నాయి.

 

వైజాగ్ మెట్రో ప్రత్యేకతలు

వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. సౌరశక్తితో కూడిన LED లైటింగ్, ట్రాక్ ల వెంట పచ్చదనం పెంచనున్నారు. స్టేషన్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. స్టేషన్లలో అత్యాధునిక డిజైన్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, CCTV, బ్యాగేజ్ స్కానర్లు, NFPA 130 నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు ఉంటాయి. కొమ్మడి, మధురవాడ, R.K బీచ్ లాంటి కీలక స్టేషన్లలో షాపింగ్ జోన్లు, మల్టీప్లెక్స్లలు, డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

 

టెండర్ల ప్రక్రియ ప్రారంభం

తాజాగా విశాఖ మెట్రోకు సంబంధించిన పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రీబిడ్ మీటింగ్ లో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అభిప్రాయాలను తీసుకుంది. ఈ మీటింగ్ లో మొత్తం 28 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సమావేశానికి హాసరైన ప్రతినిధులకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించింది. టెండర్ల దాఖలుకు జూన్ 8 వరకు గడువు ఇచ్చింది. జూన్ 9వ టెండ్లరు ప్రకటించనున్నారు. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభకానున్నాయి. మూడేళ్లలో విశాఖ మెట్రోను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.11,498 కోట్లకు పైగా ఖర్చవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VizagMetro #MetroRailVizag #VizagDevelopment #UrbanTransport #SmartCityVizag #AndhraPradeshMetro